[spt-posts-ticker]

తెలంగాణ సమాచారంతోనే రంగంలోకి!

21నే ‘తబ్లీగీ’పై అన్ని రాష్ట్రాలకు చెప్పాం: కేంద్రం

న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి) ): తెలంగాణలో అనేక మంది తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలకు కరోనా వైరస్‌ సోకిందన్న సమాచారం అందిన వెంటనే తాము రంగంలోకి దిగామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఢిల్లీలో ప్రార్థనలు జరిపిన వారి వివరాలను అన్ని రాష్ట్రాలతో పంచుకున్నామని వెల్లడించింది. మార్చి 21నే రాష్ట్రాలకు సమాచారం అందించామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. తబ్లీగీ కార్యకర్తలు, వారు కలిసిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేట్‌, క్వారంటైన్‌ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్లకు ఆదేశాలు పంపింది. మార్చి 28, 29 తేదీల్లోనూ అడ్వయిజరీలు పంపామని హోంశాఖ తెలిపింది. మార్చి 28నే దాదాపు 172 మందిని స్ర్కీనింగ్‌ చేసి క్వారంటైన్‌ చేశామని, ఇప్పటివరకు 1338 మందిని క్వారంటైన్‌లో ఉంచామని హోంశాఖ తెలిపింది. మరోవైపు ఇతర దేశాలకు చెందిన అనేకమంది తబ్లీగీ కార్యకర్తలు టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం చేశారని, పర్యాటక వీసాపై వచ్చిన వారు మత ప్రచారం చేయకూడదని అధికారులు తెలిపారు. అలా వచ్చిన విదేశీయుల వీసాలను రాష్ట్రాల పోలీసులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

ఎంతమంది వచ్చారంటే..?

నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లీగీ జమాత్‌ కేంద్ర కార్యాలయం (మర్కజ్‌ )లో ప్రార్థనలు చేసేందుకు దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచీ ముస్లింలు వస్తుంటారని హోంశాఖ తెలిపింది. విదేశీయులు కొందరు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తబ్లీగీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని వివరించింది. మార్చి 21న దాదాపు 824 మంది విదేశీ తబ్లీగీ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రచారానికి వెళ్లారని, వారితో పాటు 2100మంది స్వదేశీ ప్రచారకులూ ఉన్నారని వెల్లడించింది. వీరు కాక 216 మంది విదేశీయులు, 1500 మంది స్వదేశీయులు మర్కజ్‌లోనే ఉన్నారని తెలిపింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *