చిత్తూరు (ఆరోగ్యజ్యోతి) : దీర్ఘకాలిక రోగాలతో మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు రాష్ట్రప్రభుత్వం భరోసా ఇచ్చింది. వైఎస్ఆర్ పింఛను కానుకలో బాగంగా డీఎంహెచ్‌వో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో 8 రకాలు దీర్ఘకాలిక వ్యాధులను చేర్చి ప్రతి నెల రూ..5 వేలు పింఛను మంజురు చేసింది. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ 90 శాతం వైకల్యం ఉన్న వారికి కూడా రాష్ట్రప్రభుత్వం రూ.5 వేలు పింఛను మంజూరు చేయనుంది. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల15 వరకు గడువునిచ్చింది. ఈ పథకాన్ని జిల్లా వైద్య అరోగ్య శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 2965 మందికి పింఛను మంజూరు
జిల్లాలో దీర్ఘకాలిక రోగాలతో భాదపడుతున్న 2992 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 2965 మందికి ప్రభుత్వం రూ.5 వేలు పింఛను మంజురు చేసింది. ఇందుకు గాను రూ.1.42 కోట్లు మంజురు కాగా, 2561 మంది లబ్ధిదారులకు రూ.1.24 కోట్లు ఖాతాల్లో జమ అయింది. మిగిలిన వారికి ఖాతా నెంబర్లు సక్రమంగా ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల మంజురు కాలేదు. వాటిని కూడా మార్చినాటికి మంజురు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.
దరఖాస్తుకు 25 గడువు
వైఎస్ఆర్ పింఛను కానుక (డీఎంహెచ్‌వో పథకం) దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. రోగులు వారి పరిధిలోని పీహెచ్‌సీల్లోని వైద్యాధికారులు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు అంగవైకల్యాన్ని నిర్థారించే సదరం సరిఫికేట్, ఆధార్, బ్యాంకు ఆకౌంట్ నెంబరుతో వైద్యాధికారులను కలిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు.
సద్వినియోగం చేసుకోండి
దీర్ఘకాలిక రోగాలతో మంచానికే పరిమితమైన రోగులు వైఎస్ఆర్ పింఛను కానుక డీఎంహెచ్‌వో పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం వీరికి ప్రతి నెల రూ.5 వేలు పింఛను అందిజేస్తుంది. దీంతో రోగి భారం కుటుంబంపై పడకుండా ప్రభుత్వం ఈ పథకం ద్వారా అండగా ఉంటుండి. ఇప్పటి వరకు ధరఖాస్తు చేసుకోని అర్హులైన వారు ఈ నెల 25 లోపు పీహెచ్‌సీల్లో వైద్యుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
-పెంచలయ్య, ఇన్చార్జ్ డీఎంహెచ్‌వో