హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్ఠ చర్యలు చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. ఇరాన్లో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చే భారతీయులకు అక్కడే పరీక్షలు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇటలీ నుంచి వచ్చిన బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
గాంధీ ఆస్పత్రిలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 45 మందికి వైరస్ లేదని తేలిందని మరో ఇద్దరికి సంబంధించి శాంపిల్స్‌ను పుణెకు పంపించామని చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడని వివరించారు.