[spt-posts-ticker]

దోమల నివారణకు గాంబూసియా చేపలు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి):  ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తూ విపరీతంగా పెరుగుతున్న దోమల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్  అన్నారు.వర్షపు నీరు చేరిన ఖాళీ స్థలాలు, మురికి గుంటల్లో దోమల లార్వాలను నాశనం చేసే గంబూజియా చేప జాతిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టామై ఇందులో భాగంగా ఖానాపూర్ చెరువు లోగాంబూసియా అఫినిస్ అనే చేపలను వదిలినట్లు తెలిపినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఒక 163 చెరువులు కుంటలు నీరు నిల్వ ఉండే స్థలాలను ఎంపిక చేయడం జరిగిందని ఇందులో 50 వేలు గం బూజియా చేప పిల్లలను చెరువుల్లో విడిచి పెట్టే కార్యక్రమాన్ని చేపదుతున్నట్లు అయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాదన జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ బి రఘుపతి, సూయో, అనిల్  ఉదయ్ అరుణ్ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *