[spt-posts-ticker]

ధ్యానానికి రెండు నిమిషాలు కేటాయించండి

 

చర్లపల్లి, (ఆరోగ్యజ్యోతి): ఎంత బిజీగా గడుపుతున్నా రోజుకు కనీసం రెండు నిమిషాలు అయినా ఆధ్యాత్మికం, ధ్యానం కోసం కేటాయించాలని బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ జర్మన్‌ డైరెక్టర్‌ దీదీ బీకే సుదేష్‌ జీ కోరారు. ‘నాయకత్వ పటిష్ఠానికి 8 ఆధ్యాత్మిక సూత్రాలు’ అనే అంశంపై శనివారం ఐడీఏ చర్లపల్లిలోని సీఐఏ ఓపెన్‌ ఆడిటోరియంలో ఆమె ఉపన్యాసమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి యంత్రంలా మారిపోయి తనను తాను గుర్తించలేని స్థితికి చేరిపోయాడని, దీంతో మానసిక ఆనందం లేక వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడని అన్నారు. కలువ పువ్వు బురదలోంచి వచ్చినా తన సహజత్వమైన వికాసాన్ని కోల్పోకుండా ఉంటుందని, కలువను ఆదర్శంగా తీసుకుని మనమంతా ఎదగాలని పిలుపునిచ్చారు. ఏఎస్‌రావు నగర్‌ డైరెక్టర్‌ సునీతాజీ, మారేడ్‌పల్లి డైరెక్టర్‌ మంజుబెహన్‌, రాజుదీదీ, సీఐఏ అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *