[spt-posts-ticker]

నార్నూర్‌ పీహెచ్‌సీ ప్రారంభ నివేదికను పంపండి’

గాదిగూడ (నార్నూర్‌): నార్నూర్‌ మండల కేంద్రంలోని సీహెచ్‌సీ నిర్మాణ పనులు పూర్తయి 8 నెలలు గడుస్తోందని ‘ఈనాడు’లో ప్రచురితమైన విషయంలో జిల్లా అధికారులకు ఎందుకు స్పష్టత లేదని సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితా రాణా వైద్యాధికారులను ప్రశ్నించారు. ప్రజల కోరికనే ప్రభుత్వ కోరిక కదా? వెంటనే నార్నూర్‌ సీహెచ్‌సీ ప్రారంభ నివేదికను పంపితే వారం రోజుల్లోనే ఆసుపత్రిని ప్రారంభించి కావలసినంత మంది సిబ్బందిని నియమిస్తామన్నారు. గురువారం ఆమె గాదిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలపై దృష్టి సారిస్తూ దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తుందన్నారు. ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. జిల్లా డీఎంహెచ్‌వో వెంటనే నివేదిక పంపాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఆ శాఖ డీఎంహెచ్‌వో తొడసం చందు, రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాం నాయక్‌, జిల్లా ఉప వైద్యాధికారి డా.మనోహర్‌ కుడ్మెత, డీఐవో శ్రీకాంత్‌, వైద్యాధికారి పవన్‌కుమార్‌, సీనపల్లి విజయ్‌కుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *