[spt-posts-ticker]

నార్సింగిలో శంకర కంటి ఆస్పత్రికి శంకుస్థాపన

హైదరాబాద్‌,: హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతంలో శంకర ఐ ఫొండేషన్‌ బృందం కంటి ఆస్పత్రి నిర్మాణానికి ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేసింది. ఇది శంకర ఐ ఫౌండేషన్‌ 12వ ఆస్పత్రి. 200 పడకలతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి 2021 నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఫౌండేషన్‌ ప్రతినిధి వెంకట్‌ మద్దిపాటి వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో పేద ప్రజల కంటి సమస్యలను తీర్చే లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. శంకర కంటి ఫౌండేషన్‌ ఇప్పటికే తమ ఆస్పత్రుల ద్వారా 20లక్షల మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలను పూర్తి చేసిందన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో  ఫౌండేషన్‌ ప్రతినిధులు వెంకట్‌ మద్దిపాటి, సుధీర్‌ వేముల, నారాయణ కళ, కరుణాకర్‌ చెముడుగుంట, అచ్యుతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆస్పత్రిని నిర్మాణానికి బాటా, స్టాండవ్‌‌, డీఎన్‌ఎఫ్‌,  చిరాగ్‌ ఫౌండేషన్‌, తదితర సంస్థలు, అనేక మంది వ్యక్తులు విరాళాలు అందజేశారని కరుణాకర్‌ చెముడుగుంట తెలిపారు. గత నాలుగేళ్లుగా ఎంతోమంది వాలంటీర్లు కష్టపడి నిధులను సమకూర్చారని చెప్పారు. వారందరి కల త్వరలోనే నెరవేరబోతుందని తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *