[spt-posts-ticker]

నిద్రపుచ్చే ‘టీ’

హాయిగా కంటి నిండా నిద్ర పోవాలనుకుంటున్నారా… రాత్రి పడుకోబోయే ముందు ఓ కప్పు టీ తాగండి. మీరు సరిగ్గానే చదివారు. అది సాధారణ టీ కాదు సుమా… అల్లం, పుదీనా, నిమ్మ ఇవేవీ కాదు.. ఇదొక పండుతో చేసేది. ప్రత్యేకమైంది. అదేనండి అరటిపండు టీ…
అరటిపండును శుభ్రంగా కడిగి… రెండువైపులా కొనలు తీసేయాలి. పాత్రలో ఓ గ్లాసు నీళ్లు పోసి, అరటి పండు వేసి పదినిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత వడబోయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ టీ తాగేయాలి. కావాలనుకుంటే చిటికెడు దాల్చినచెక్క పొడి వేసుకోవచ్చు. లేదా మరుగుతున్న నీటిలో అరటిపండుతోపాటు దాల్చిన చెక్క ముక్క కూడా వేయొచ్చు. ఈ పండు తియ్యగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చక్కెర, తేనె వంటివి అక్కర్లేదు. అరటిలోని పొటాషియం, మెగ్నీషియం మూలకాల వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పండులోని అమైనో ఆమ్లాలు స్లీప్‌ హార్మోన్‌గా పిలిచే మెలటోనిన్‌ను ప్రేరేపిస్తాయి. దాంతో హాయిగా నిద్రపోతారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *