[spt-posts-ticker]

నిద్ర మత్తులో ఆరోగ్యశాఖ

 

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో వైద్యఆరోగ్యశాఖ అవినీతిమయమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. కొవిడ్‌-19(కరోనా వైరస్‌)పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంటే సమీక్షలు నిర్వహించకుండా ఆ శాఖ నిద్రమత్తులో జోగుతోందని, వైరస్‌ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదని విమర్శించారు. భాజపా వైద్యుల విభాగం ఆధ్వర్యంలో ‘కొవిడ్‌ 19 నివారణకు ఉచిత హోమియో మందు పంపిణీ’ని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. రూ.35 లక్షల విలువైన మందులను ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. కొవిడ్‌-19 బారినపడ్డ ఇద్దరు అనుమానితుల్ని గుర్తించినట్లు చెప్పిన వైద్యుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *