[spt-posts-ticker]

నిమ్స్‌ న్యూరాలజిస్ట్‌ మీనా ఆరోగ్యం విషమం

  • లండన్‌ న్యూరాలజీ సదస్సులో ప్రసంగిస్తుండగా గుండెపోటు
హైదరాబాద్‌ : నిమ్స్‌ న్యూరాలజీ విభాగంలోని ఓ యూనిట్‌ అధిపతి ప్రొఫెసర్‌ ఏకే మీనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు గుండెపోటు రావడంతో లండన్‌లోని సెయింట్‌ బర్తోలోమ్యూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. లండన్‌లో జరుగుతున్న న్యూరాలజీ సదస్సులో పాల్గొనడానికి ఈనెల 13వ తేదీన ఆమె వెళ్లారు. అక్కడ సదస్సులో ప్రసంగిస్తున్న సమయంలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది.ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు యాంజీయోప్లాస్టీ చేసి మూడు స్టెంట్లు వేసినట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని నిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్‌ మీనా 1991లో గాంధీ వైద్య మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేసి నిమ్స్‌లో చేరారు. అనంతరం ఆమె నిమ్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌లో చేరి న్యూరాలజీ పూర్తి చేసి అక్కడే వైద్యురాలిగా స్థిరపడి సేవలు అందిస్తున్నారు.ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు యాంజీయోప్లాస్టీ చేసి మూడు స్టెంట్లు వేసినట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని నిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్‌ మీనా 1991లో గాంధీ వైద్య మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేసి నిమ్స్‌లో చేరారు. అనంతరం ఆమె నిమ్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌లో చేరి న్యూరాలజీ పూర్తి చేసి అక్కడే వైద్యురాలిగా స్థిరపడి సేవలు అందిస్తున్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *