[spt-posts-ticker]

నిరంతర అ ప్రక్రియగా కుష్టువ్యాధి సర్వే

    • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

    ఆదిలాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): ఇక నుండి కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించి సర్వే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడు యాక్టివ్ కేస్ డిటెక్షన్ అండ్ రెగ్యులర్ సర్వైలెన్స్ ఫర్  లెప్రసీ అనే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎండిటి ప్రారంభదశలో కుష్టు వ్యాధిగ్రస్తులు ప్రతి పది వేల మందికి 66 మంది ఉండేవారన్నారు. ఎండిటి  చికిత్స అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజురోజుకు కుష్టి వ్యాధి గ్రస్తుల సంఖ్య జిల్లాలో తగ్గుముఖం పట్టిందని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం 2004 సంవత్సరంలో చేరుకున్నామని ప్రతి పదివేల మందికి ఒకరు లేరా అంతకన్నా తక్కువ మందికి కుష్టి వ్యాధి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2017 ,2018 ,2019 సంవత్సరాల్లో రోగులను గుర్తించేందుకు 14 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించామని  ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సమాజం లో దాగి ఉన్న కేసులను గుర్తించేందుకు ఇది సర్వే ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇక నుండి ప్రతి ఏటా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ఇంటింటి సర్వే ఏడాదికి రెండుసార్లు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం అదనపు డి ఎం హెచ్ ఓ జిల్లా అధికారి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని సమాజంలో దాగిఉన్నరోగులను  గుర్తించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు .సర్వే బృందాలు తమ తమకు కేటాయించిన ఇళ్లను సందర్శిస్తారని ప్రతి ఒక్కరు వివరాలు తెలపాలన్నారు .ఈ కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఆశా కార్యకర్తలు ,పురుషులు వెసులుబాటు ఉపయోగించుకొని సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్, డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వామంరావ్, మధుసూదన్ రావు, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ , ల్యాబ్ టెక్నీషియన్ రమణాచారి ,రాజారెడ్డి వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *