[spt-posts-ticker]

నిర్ణీత గడువులోపు క్షయను నివారించాలి:తమిళిసై

హైదరాబాద్‌: ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ క్షయ వ్యాధి (టీబీ) ఇంకా ప్రబలడం బాధాకరమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాష్ట్రంలో క్షయను పూర్తిగా నిర్మూలించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని వైద్యాధికారులను ఆమె ఆదేశించారు. హైదరాబాద్‌లో క్షయ వ్యాధులు పెరగడంపై గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. క్షయ వ్యాధి నియంత్రణపై అధికారులతో రాజ్‌భవన్‌లో తమిళిసై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం, హైదరాబాద్‌లో క్షయ తీరుపై చర్చించారు. ఈ వ్యాధి కేసులు పెరగడం బాధాకరమని.. నిర్ణీత గడువులోపు నిర్మూలన చాలా ముఖ్యమని సూచించారు.

వ్యాధిగ్రస్తులందరికీ నాణ్యమైన రోగ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్‌ జిల్లా వైద్యాధికారి వెంకట్‌, క్షయ నివారణ సంఘం ప్రధాన కార్యదర్శి సుధీర్‌ ప్రసాద్‌లను ఆదేశించారు. మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జంట నగరాల్లోని అన్ని బస్తీలు, నైట్‌ షెల్టర్లు, ఇతర ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారిని గవర్నర్‌ ఆదేశించారు. క్షయ, డెంగ్యూ, క్యాన్సర్‌ రోగాలపై విస్తృతంగా తాను పరిశోధనలు చేశానని.. సమాజం సహకారంతో ఈ మూడు రోగాలను పూర్తిగా  నివారించవచ్చని చెప్పారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీకి చెందిన లక్షా 80వేల మంది సభ్యులు క్షయ రహిత సమాజం కోసం క్రియాశీలక పాత్ర పోషిస్తారన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *