[spt-posts-ticker]

నేటినుంచి మూడవ విడత కంటివెలుగు

60 ఏళ్లుపైబడినవారికి కంటిపరీక్షలు

నియోజకవర్గానికి ఓ మండలంలో నిర్వహణ

ఏర్పాట్లు సిద్ధం చేసిన జిల్లా వైద్యశాఖ

అనంతపురం : పండుటాకుల్లో దృష్టిలోపం నివారణ కోసం మంగళవారం నుంచి కంటిపరీక్షలు నిర్వహించనున్నారు. 60ఏళ్లు పైబడిన అ వ్వాతాతలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. నియోజకవర్గానికి ఓ మండలంలో మూడవ విడత వైఎ్‌సఆర్‌ కంటివెలుగు కింద మంగళవారం నుంచి ఈ స్ర్కీ నింగ్‌ పరీక్షలు చేపడతారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను వైద్యశాఖ  సిద్ధం చేసింది. దృష్టిలోపం నివారించి ప్రతి ఒక్కరికీ చూపు కల్పించాలనేది ప్రభుత్వ ఆశయం. గత ఏడాది అక్టోబరు 10న జిల్లాలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌  ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి, రెండు విడతల కింద ఒకటి నుంచి 10వ తరగతి వరకూ చదువుకుంటున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మూడవ విడత కింద ముసలివారికి  చేపట్టనున్నారు. జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా.. ప్రతి నియోజకవర్గం నుంచి ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిం చను న్నారు.

ఏఏ కేంద్రాల్లో..

వృద్ధులకు మంగళవారం నుంచి వైఎ్‌సఆర్‌ కంటి వెలుగు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో ముదిగుబ్బ, మలకవేముల పీహెచ్‌సీల్లోనూ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం, మడకశిర నియోజకవర్గంలోని మడకశిర మండలంలో నీలకంఠాపురం, కదిరేపల్లి, కల్లుమర్రి, గుండుమల పీహెచ్‌సీల్లోనూ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలంలో గుట్టూరు, నల్లమాడ(పుట్టపర్తి)మండలంలో రెడ్డిపల్లి, లేపాక్షి(హిందూపురం)మండలంలో లేపాక్షి, కదిరి(కదిరి) మండలంలోని పట్నం పీహెచ్‌సీలోనూ పరీక్షలు నిర్వహిస్తారు. పామిడి(గుంతకల్లు) మండలంలో ఎద్దులపల్లి, సీకేపల్లి(రాప్తాడు) మండలం ఎన్‌ఎ్‌సగేటు, కురుగుంట, కణేకల్లు(రాయదుర్గం) మండలంలో ఎర్రగుంట, గరుడచేడు, తాడిపత్రి(తాడిపత్రి) రూరల్‌ మండలం చుక్కలూరు, శింగనమల(శింగనమల) మండలంలో తరిమెల, ఉరవకొండ(ఉరవకొండ) మండలంలో రాకెట్ల, కౌకుంట్ల పీహెచ్‌సీల్లోనూ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలోని 15 డివిజన్లలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ 14 ప్రాంతాల్లో కలిపి సుమారు 1.20 లక్షల మంది వృద్ధులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

696మంది ఆశావర్కర్ల ఎంపిక..

వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే సంబంధిత 20 పీహెచ్‌సీలకూ మెటీరియల్‌ పంపిణీ చేశారు. స్ర్కీనింగ్‌ పరీక్షల నిర్వహణకు 696మంది ఆశా వర్కర్లను నియమించారు. తొలిదశలో వారు స్ర్కీనింగ్‌ చేస్తారు. దృష్టిలోపం ఉన్నవారికి రెండవ దశలో ఆప్తమాలజిస్టులు పరీక్షలు చేస్తారు. అందులోనూ దృష్టిలోపం ఉన్నట్లు తేలితే మూడవ దశలో కంటి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లోనూ దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి అవసరమైనవారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *