[spt-posts-ticker]

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి

జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్

ఆదిలాబాద్, జైనథ్ (ఆరోగ్యజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరవని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. మంగళవారం జైనథ్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అకుర్ల గ్రామంలో  పరిశుభ్రతపై ఆయన ఇంటింటికి తిరిగి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వ్యాధులు దరిచేరవు అన్నారు. వర్షాకాలం  కావడంవల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి చుట్టు చెత్తాచెదారం ఎక్కడికక్కడ మురుగునీరు చేరటం టైర్లు కూలర్లు వాడుకునే లో నీటి నిల్వ ఉంచడం వల్ల ఈగలు, దోమలు చేరి మలేరియా, డెంగ్యూ ,డఏరియ  లాంటి వ్యాధులు దరి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *