- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జనవరి 17న నిర్వహించే పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. బుధవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశమందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లకు చెందిన వైద్యాధికారులకు సుపరవైజార్ లకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 17,భూతుల్లో, 18, 19నఇంటింటికీ నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు ఏ విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిబంధనలకు నిబంధనలు పాటించాలని తెలిపారు .ముఖ్యంగా మాస్కులు ధరించాలని ఫ్యాక్టరీ మరియు సంచారజాతుల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు .అనంతరం ప్రాంతీయ రీజినల్ మెడికల్ అధికారి అతుల్ నిగాని మాట్లాడుతూ సిబ్బందికి బూత్ నిర్వహణలో రోజు పాటించవలసిన నియమ నిబంధనలు జాగ్రత్తల గురించి ఆయన తెలిపారు. రెండు రోజులపాటు ఇంటింటికి తిరిగి చుక్కలు వేసే కార్యక్రమంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిప్యూటి డియంఎహ్ఓ డాక్టర్ సాదన , జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్.డాక్టర్ విజయ సారథి వైద్య అధికారులు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు