ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో ప్రసూతి దవాఖానపై ఉగ్రవాదులు మంగళవారం దాడి చేశారు. వారి కాల్పుల్లో ఇద్దరు శిశువులు వారి తల్లులతోసహా 14 మంది మరణించారు. సైనికులు ఉగ్రవాదులను ప్రతిఘటిస్తూనే చిన్నారులు, బాలింతలను చేతులతో ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముగ్గురు ముష్కరులను హతమార్చారు. నాంగఢ్ రాష్ట్రంలో అంత్యక్రియలు జరిగే చోట ఆత్మాహుతి బాంబుదాడిలో 21 మంది చనిపోగా 55 మంది గాయపడ్డారు. మరో పేలుడు ఘటనలో ఓ చిన్నారి మరణించగా పది మంది గాయపడ్డారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]