[spt-posts-ticker]

పెద్దాసుపత్రిని పరిశీలించిన ఎన్‌క్వాస్‌ బృందం

 

వైద్యాధికారులతో మాట్లాడుతున్న డాక్టర్‌ దేవ్‌కిరణ్‌

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నేషనల్‌ క్వాలిటీ అస్సెస్‌మెంట్‌(ఎన్‌క్యూఏఎస్‌) బృందం సోమవారం పరిశీలించింది. బృంద సభ్యులైన కేరళకు చెందిన డాక్టర్‌ దేవ్‌కిరణ,్‌ హరియాణా నుంచి డాక్టర్‌ రాజేశ్‌రాజు ఆస్పత్రిని సందర్శించి సేవలను సమీక్షించారు. లాబోరేటరీ, ఆపరేషన్‌ థియేటర్‌, అత్యవసర చికిత్స విభాగం, సాధారణ సేవలు, రక్తనిధి కేంద్రం, ప్రసూతి, పిల్లలు, ఓపీడీ విభాగాలను తనిఖీ చేసి సేవల తీరును అంచనా వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, హెచ్‌వోడీలు డాక్టర్‌ కృపా ఉషశ్రీ, డాక్టర్‌ రామూనాయక్‌, డాక్టర్‌ నాగేశ్వరరావు, క్వాలిటీ మేనేజర్‌ ఉపేందర్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సుగుణ, ఎల్‌టీ నందగిరి శ్రీను, వీరయ్య పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *