వరంగల్,(ఆరోగ్యజ్యోతి):కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఓరుగల్లు మహిళ మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు మహిళా మండలి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు బోళ్ల సుజాత. కోఆర్డినేటర్ రావుల రాకేష్. కర్ణాకర్. స్వప్న. కావ్య తో పాటు మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీనివాస్ హాజరైనారు. పేదలకు గత నెల రోజుల నుండి సరైన కూరగాయలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని 150 మందికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు సుజాత తెలిపారు.ప్రతి దాత ముందుకు వచ్చి తనకు తోచిన సహాయ సహకారాలను అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. పేదలు పని లేక నానా ఇబ్బందులు పడుతున్నారని చివరకు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని అందుకు నాకు తోచిన సహాయ సహకారాలు అందించాలని ఆమె సూచించారు

పేదలకు కూరగాయల పంపిణీ
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]