[spt-posts-ticker]

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు

ఎంపీని కలిసిన రిమ్స్‌ డైరెక్టర్‌, వైద్యులు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్నివర్గాల ప్ర జలకు మెరుగైన వైద్యం అందించాలని అందుకు అంకితభావం, క్రమశిక్షణ తో వైద్యబృందం పనిచేయాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావ్‌ అ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఎంపీ సోయం బాపురావ్‌ను కలిసిన రిమ్స్‌ డైరెక్టర్‌ భానోత్‌ బలిరాం పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సోయంబాపురావ్‌ రిమ్స్‌లో ప్రజలకు అందుతున్న వైద్యం, కల్పించిన సౌకర్యాలు, వైద్యుల కొరత, పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పేద ప్రజలు ఉన్నా రని వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. వైద్యం కోసం వచ్చిన వారికి ప్రేమ, అప్యాయతలతో పలుకరించి వారి సమస్యను, వ్యాధిని, రోగాలను అడిగి తెలుసుకోవాలని తెలిపారు.

అప్పుడే రోగుల్లో ఉన్న సగం వ్యాధులు దూరమవుతాయని అన్నారు. రిమ్స్‌లో వైద్యులు సమ యపాలన పాటించాలని, సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్కరికి మం చి వైద్యాన్ని అందించాలన్నారు.రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చే రోగులు అనేక మం ది పేదవారే ఉన్నారని వారి పరిస్థితిని తెలుసుకొని వైద్యం అందించడంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అపరిశుభ్రత లేకుండా చూడాలని ఆదేశించారు. ఇందులో పలువురు వైద్యులు తదితరులున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *