ఘట్కేసర్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర కార్మిక,ఉపాధిశాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర టీఆర్ఎస్ మండల నాయకులు తటాకం భానుచందర్ శర్మ, తటాకం నారాయణ శర్మలు అందజేసిన అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్టితో కలిసి మంగళవారం ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఆరోగ్య శాఖను పటిష్ట పరిచేందుకు ఎప్పటి కప్పు డు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక అంబులెన్స్ వాహనాలను సమకూరుస్తున్నారని అన్నారు. దవాఖానాల ఆధునీకరణ, వైద్యులు, సిబ్బంది ఏర్పాటు, నూతన భవనాల నిర్మాణాలవంటి చర్యలను చేపడుతున్నారని మంత్రి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పి. మాధవ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, రైతు సొసైటీ చైర్మన్ ఎస్. రాంరెడ్డి, మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, దవాఖాన సూపరింటెండెంట్ కోట్యానాయక్, కమిషనర్ వసంత, తహసీల్దార్ విజయలక్ష్మి, రైతు సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు,ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య పెరుగుతుండడంతో దవాఖా నను 50 పడకల నుంచి 100 పడకల దవాఖానగా అభివృద్ధి చేసేందుకు దవాఖాన సలహా సంఘం కమిటీ తీర్మానించింది. మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంతి మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఏరియా దవాఖానలలో ఒకటైన ఘట్కేసర్ దవాఖానకు ఘట్కేసర్ మండల గ్రామాల ప్రజలతో పాటుగా, కీసర, బీబీనగర్, పోచంపల్లి, తదతర మండలాల నుంచి గర్భిణు లు, రోగులు 250 మంది వరకు వస్తున్నారని ఇక్కడి వసతులు సరిపోవడం లేదని సభ్యులు పేర్కొన్నారు. దవాఖానలో సిటీ స్కాన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించింది .చిన్న పిల్లలు, అప్పుడే జన్మించిన శిశువులకు పది పడకలతో కూడిన ఎన్.బీఎస్.యూ(న్యూబర్ ఇన్టెన్సివ్ యూనిట్)ఏర్పాటు చేయాలని కమిటీ సూచిం చింది. ప్రస్తుతం మంత్రి ప్రారంభించిన అంబులెన్స్ వాహనాన్ని దవాఖాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రామాంజనేయులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో నారాయణ, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, దవాఖాన సూపరింటెండెంట్ కోట్యానాయక్,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజార్యోగంపై ప్రత్యేక శ్రద్ధ
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]