[spt-posts-ticker]

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి

ఆదిలాబాద్,బేల(ఆరోగ్యజ్యోతి): సైద్ పుర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చప్రాల  ఉప ఆరోగ్య కేంద్రం లోమంగళవారం రోజు 100 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గా ఆరోగ్య కార్యకర్త సువర్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి అన్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ మాదిరిగానే కరోనా వ్యాక్సిన్ ఉంటుందని ఎవరు భయపడవలసిన అవసరం లేదన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. అపోహలను పక్కనపెట్టి వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సంగీత కమల సమిత విటబాయీ మంద సునీత్ర తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *