[spt-posts-ticker]

ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి పర్యటన

మంచిర్యాల: ప్రపంచ వ్యాప్తంగా కరోనా (కొవిడ్‌-19) కలకలం సృష్టిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియంత్రణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వైరస్‌ను తట్టుకునే శక్తి రాష్ట్ర ఆరోగ్యశాఖకు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి (డబ్ల్యూహెచ్‌వో కన్సల్‌టెంట్‌) జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌(కరోనా వార్డు) గదిని ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధి తీవ్రత ఎక్కువైతే జిల్లా ఆసుపత్రి ఏ మేరకు సేవలు అందించగలుగుతుంది, సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయా, లేదా అని ఆరా తీశారు. నూతనంగా ఐసీయూ వార్డు ఏర్పాటుతో పాటు చేయాల్సిన పనులు, కావాల్సిన నిధులను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఇంజినీర్లతో అంచనా వేయించారు. ఆసుపత్రికి సరిపడా సిబ్బంది, వైద్యులు ఉన్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, చేపట్టాల్సిన పనులపై త్వరలో చేపట్టబోయే సమావేశంలో చర్చించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా.శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.నీరజ, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డా.అరవింద్‌, ఆర్‌ఎంఓ డా.అనిల్‌, చాతి వైద్య నిపుణులు కుమారస్వామి, ప్రశాంత్‌, జనరల్‌ ఫిజిషీయన్‌ అజిత్‌ మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *