[spt-posts-ticker]

ప్రభుత్వ ఆసుపత్రి వైపే ప్రసూతి సుపు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి):కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి       కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్‌, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మూడునెలల్లో 1,39,887 డెలివరీలు లక్ష్యంగా ఆయా దవాఖానల్లో తగిన ఏర్పాట్లుచేసింది. ఇందులో ఎక్స్‌పెక్టెడ్‌ డెలివరీ డేట్‌ (ఈడీడీ) సంఖ్య 1,09,665, హైరిస్క్‌ (హెచ్‌ఆర్‌) కేసుల సంఖ్య 30,222 ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మార్చినెలలో ఈడీడీ కేటగిరీలో 13,198, హైరిస్క్‌ కేసుల్లో 574 మందికి ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగాయి. ఏప్రిల్‌లో ఈడీడీ కేసులు 45,489, హెచ్‌ఆర్‌ కేసులు 13,583, మేలో ఈడీడీ కేసులు 50,978, హెచ్‌ఆర్‌ కేసులు 16,065 ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మూడు నెలల్లో డెలివరీ తేదీల అంచనా, హైరిస్క్‌ ఉన్న గర్భిణులను సకాలంలో దవాఖానలకు తీసుకొచ్చి ప్రసవాలు జరిపేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సాధారణ డెలివరీ జరిగే అవకాశం ఉన్న వారిని నిర్ణీత తేదీల్లో కేసీఆర్‌ అమ్మఒడి వాహనంలో దవాఖానకు తరలిస్తున్నారు. రిస్క్‌ గ్రూపునకు చెందినవారి పట్ల ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా దవాఖానకు తరలించేలా ఏర్పాట్లుచేస్తున్నారు.

వందశాతం డెలివరీల అంచనా..

రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభించకముందు సర్కారు దవాఖానల్లో 25 శాతం ఉన్న ప్రసవాలు.. ప్రస్తుతం 65 శాతానికిపైగా చేరుకున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రసవం కోసం ప్రైవేటుకు కాకుండా అందరూ ప్రభుత్వ దవాఖానలకే వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు రోగులపై చూపుతున్న శ్రద్ధ, ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సదుపాయాలు కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం వందశాతం వరకు డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగే అవకాశం ఉన్నదని వైద్యశాఖ అంచనావేస్తున్నది.

వైద్యారోగ్యశాఖ జాగ్రత్తలు

  • కరోనా వైరస్‌ నేపథ్యంలో గర్భిణులతోపాటు సిబ్బందికి వైద్యారోగ్యశాఖ పలు జాగ్రత్తలు సూచించింది.
  • గర్భిణులను దవాఖానకు తరలించేటప్పు డు వాహనంలో తక్కువమంది రావాలి.
  • ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. నిర్ణీత దూరం పాటించాలి.
  • గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉం డాలి. చేతులతో ముఖాన్ని తాకొద్దు. శానిటైజర్‌ ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • దవాఖానలకు అనవసరంగా రాకూడదు. జలుబు, దగ్గు వంటివి ఉంటే జాగ్రత్తపడాలి.
  • ఏదైనా అత్యవసరమైతే ఆశ, ఏఎన్‌ఎంల సహకారంతో నిర్ణయించిన దవాఖానకు వెళ్లాలి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *