[spt-posts-ticker]

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచాలి జిల్లా పాలనాధికారి శరత్‌

కామారెడ్డి: : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెంచాలని జిల్లా పాలనాధికారి శరత్‌ పేర్కొన్నారు. జనహిత భవన్‌లో వైద్యశాఖ సమీక్షలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ప్రజల్లో వ్యాధి నిరోధకత పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రోగుల సంఖ్య ఎక్కువగా లేకుంటే వైద్య శిబిరాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని సూచించారు. కేసీఆర్‌ కిట్‌లను లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. క్షయ వ్యాధి నివారణకు కృషి చేస్తూనే అనుమానితులకు వైద్యపరీక్షలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి వెంకటేశ్‌ ధోత్రే, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *