[spt-posts-ticker]

ప్రమాదమని తెలిసి.. వాగు దాటి వైద్యం

జిల్లాస్టాయీ అధికారి పడవ ప్రయాణం …వైద్య సేవలు 

– సిబ్బంది  సేవలు బేష్

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఈ రోజుల్లో ప్రమాదం ఉందంటే వెళ్లడానికి వెనుక అడుగు వేస్తారు… ప్రమాదమని తెలిసి కూడా ఆ గిరిజనులకు వైద్యం అందించాలని ఉద్దేశం ఉన్న వైద్య సిబ్బంది చాలా తక్కువ…జిల్లాస్టాయీ అధికారి పడవ ప్రయాణం చేసి  వైద్య సేవలు అందిచడం అనేది  ఎవరు ఉహించరు.. కానీ ఆదిలాబాద్ జిల్లా లో మాత్రం ఇలా సేవలు అందిస్తున్నారు.జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ మాత్రం పడవ ప్రయాణం చేసి వైద్యసేవలు అందించారు.

గ్రామంలో రోగులకు వైద్య సేవలు అందించి, దోమతెరలు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం లో గల లకంపూర్ ఈ గ్రామం  మండలం  వేరైనా , ఇంద్రవెల్లి  మండలం లోని పిట్ట బొంగరం ప్రాతమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుంది.   సిరికొండ మండలం లోని లకంపూర్ గ్రామానీకి ఆదివారం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందివెళ్లారు.గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేదు కానీ ఆ గ్రామంలో గిరిజనులు కు వైద్య సేవలు అందించడానికి వెళ్లాలంటే వెళ్లక తప్పదు మరి నాటు పడవల్లో ప్రమాదమని తెలిసి కూడా జిల్లా మలేరియా అధికారి సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హరీష్ సూపర్వైజర్ అశోక్ వైద్య సిబ్బంది విజయ్ కుమార్, ఆరోగ్య కార్యకర్త సుశీల కలిసి ఆదివారం నాడు వెళ్లారు. వైద్య సిబ్బంది వెళ్లి అక్కడ గిరిజనులకు వైద్య సేవలు అందించడంతో పాటు దోమతెరలు పంపిణీ చేశారు ప్రతి వైద్య సిబ్బంది కూడా వీళ్లను ఆదర్శంగా తీసుకొని వైద్యసేవలు అందించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించిన వారవుతారు మనందరం ప్రతి ఒక్కరు కూడా ఇలాగే విధులు నిర్వహించాలని కోరుకుందాం….

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *