టికెట్లు రద్దయ్యాయన్న కారణంగా దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. మరోవైపు విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు రైల్వే స్టేషన్లకు బారులుదీరారు. ఈ కారణంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. కరోనా ఆందోళనల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే స్టేషన్ లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]