న్యూఢిల్లీ : గర్భిణులకు చెల్లించే ప్రసూతి సేవల ఖర్చును రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచుతూ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎ్సఐసీ) నిర్ణయం తీసుకుంది. ఈఎ్సఐసీ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో అనివార్య కారణాలతో సేవలు పొందలేక, వేరే ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులకు ప్రసూతి వైద్యం కింద ఈ ఖర్చులు చెల్లిస్తారు. అలాగే 2020-21 నుంచి ఈఎ్సఐసీ వైద్య సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసేందుకూ ఈఎ్సఐసీ ఆమోదం తెలిపింది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]