[spt-posts-ticker]

ప్రాంతీయాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

 

 

భైంసా  : భైంసా పట్టణ ప్రాంతీయాసుపత్రిలో ప్రజల కోసం మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే, ఆసుపత్రి ఛైర్మన్‌ జి.విఠల్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా అదనపు పాలనాధికారి భాస్కరరావుతో కలిసి శుక్రవారం ప్రాంతీయాసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రసూతి, శస్త్రచికిత్స, శిశు, ఆరోగ్యశ్రీ.. విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి విచారించారు. ప్రైవేటు ఆసుపత్రుల తరహాలో ఆయా విభాగాలను తీర్చిదిద్దడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. ప్రాంతీయాసుపత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్‌ కాశీనాథ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ సురేందర్‌, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ అనిల్‌, విజయానంద్‌, ఆర్డీవో ఇ.రాజు, తహసీల్దార్‌ నర్సయ్య, ప్రత్యేకాధికారులు, తెరాస నాయకులు మురళీగౌడ్‌, భీంరావు, అహ్మద్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *