[spt-posts-ticker]

ప్రాథమిక వైద్యం బలోపేతంపై దృష్టి

 

హైదరాబాద్‌: గ్రామీణ స్థాయిలో జబ్బుల నివారణ, అవగాహనపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు(హెచ్‌డబ్ల్యూసీ)గా అభివృద్ధి పరచడంలో రాష్ట్రాలు చొరవ చూపించాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఆరోగ్య ఉప కేంద్రాలను హెచ్‌డబ్ల్యూసీలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులతో శుక్రవారం దృశ్య మాధ్యమ సమీక్షను నిర్వహించింది. ఒక్కో హెచ్‌డబ్ల్యూసీ అభివృద్ధికి రూ.13 లక్షల చొప్పున నిధులను సమకూర్చనుంది. తెలంగాణ నుంచి 2020-21 సంవత్సరానికి 500 హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను అభివృద్ధి చేయడానికి నిధులు సమకూర్చాలని ఇప్పటికే కేంద్రానికి నివేదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇదే విషయంపై శుక్రవారం నాటి సమీక్షలోనూ ప్రస్తావించింది.  ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం నిలకడగా ఉందని, రాష్ట్రాల్లో ఇప్పుడు అనుసరిస్తున్న నివారణ చర్యలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 89 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా, ఇందులో 88 నమూనాల్లో కొవిడ్‌ 19 వైరస్‌ లేదని నిర్ధారణ అయింది. ఒక నమూనా ఫలితం వెల్లడవ్వాల్సి ఉందని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *