న్యూఢిల్లీ: కొవిడ్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరోనా ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రైవేటు ఆస్పత్రుల అడ్డగోలు దోపిడిని అరికట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయం కట్టాలా? కూల్చాలా? విషయం పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తో కలసి తెలంగాణలో విస్తృమవుతున్న కరోనా తీరుపై బుధవారం ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా, తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రిగా తెలంగాణ ఆరోగ్యమంత్రి, అధికార యంత్రాంగంతో నిరంతరం మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టండి: కిషన్‌రెడ్డి
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]