[spt-posts-ticker]

ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరగాలి

  • జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

నిర్మల్(ఆరోగ్యజ్యోతి): జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో 25శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రయివేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.   ఈ  సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో 25శాతం సాధారణ ప్రసవాలు  కచ్చితంగా జరగాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. అనంతరం గర్భస్థ లింగ నిర్దారణకు సంబంధించిన పోస్టర్లను, బుక్ లెట్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, డాక్టర్లు కార్తీక్, ఆశిష్, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *