[spt-posts-ticker]

ప్రొటీన్‌పై గురితో ఉబ్బసానికి అడ్డుకట్ట!

లండన్‌: ఉబ్బసంతో బాధపడేవారికోసం మెరుగైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధకులు కీలక ముందంజ వేశారు. క్షీరదాల్లో అలర్జీలకు కారణమవుతున్న ఓ కీలక ప్రొటీన్‌ను గుర్తించారు. సాధారణంగా ‘కాస్పసె-11’ అనే ప్రొటీన్‌ బ్యాక్టీరియాలపై పోరులో దోహదపడుతుంది. అయితే- ఈ ప్రొటీన్‌ అవసరానికి మించి క్రియాశీలమైనప్పుడు మామూలు కణాలు కూడా మృత్యువాతపడుతుంటాయని ఐర్లాండ్‌ పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. మృత కణాల నుంచి వెలువడే పదార్థాలు శ్వాస వ్యవస్థకు సంబంధించిన భాగాల్లో చేరి అలర్జీలకు కారణమవుతున్నాయని, ఫలితంగా ఉబ్బసం తీవ్రమవుతోందని తేల్చారు. మానవుల్లో కాస్పసె-11 ప్రొటీన్‌ ప్రత్యేకంగా ‘కాస్పసె-4’ రూపంలో ఉంటుందని వారు తెలిపారు. దాన్ని లక్ష్యంగా చేసుకొని ఉబ్బసానికి మెరుగైన చికిత్సా మార్గాలను అభివృద్ధి చేయొచ్చునని భావిస్తున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *