[spt-posts-ticker]

ప్లాస్మా దాతలు ముందుకు రండి..

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వస్తుంది. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌ బాబు, సాయికుమార్‌, గాయకుడు రఘు కుంచె ట్విట్టర్‌ వేదిక ద్వారా సీపీని ప్రశంసించారు. సైబరాబాద్‌ సీపీ వీడియోను తెలంగాణ సీఎమ్‌ఓ, తెలంగాణ డీజీపీకి ట్యాగ్‌ చేశారు. కొవిడ్‌ను జయించిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు. సైబరాబాద్‌ పోలీసు, ఎస్‌సీఎస్‌సీ చేపట్టిన ప్లాస్మా దానం కార్యక్రమానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన వేదిక అభినందనీయమన్నారు. కొవిడ్‌ నుంచి బయటపడ్డవారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వీడియోను ట్యాగ్‌ చేసి విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానంపై అపోహలు అవసరం లేదని, దానం చేసిన తర్వాత 24 నుంచి 72 గంటల్లో తిరిగి ప్లాస్మా శరీరంలోకి వచ్చేస్తుందని సీపీ సజ్జనార్‌ ఇదివరకే తెలిపారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *