[spt-posts-ticker]

ఫార్మా రంగంలో పరిశోధనలు అవసరం

నారాయణగూడ: వైద్యారోగ్య రంగానికి ‘కరోనా’ వంటి కొత్త కొత్త వైరస్‌లు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటాయని.. వాటిని ఎదుర్కొనేందుకు బయో సైన్సెస్‌లో విస్తృత పరిశోధనలు జరగాలని కెఎల్‌ఈ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం(బెల్గామ్‌) పూర్వ ఉపాధ్యక్షుడు, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పూర్వ అధ్యక్షుడు ఆచార్య సి.కె.కొకాటే అన్నారు. అవంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ‘బయో అధ్యాయన్‌-2020’ పేరిట ‘కరెంట్‌ ట్రెండ్స్‌ అండ్‌ ఛాలెంజెస్‌ అహెడ్‌ ఇన్‌ బయోసైన్సెస్‌’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కొకాటే ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా ఎదిగిందన్నారు. ఎఫ్‌ఏసీ అండ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ(తెలంగాణ) జాయింట్‌ డైరెక్టర్‌ డా.బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మందుల నాణ్యత విషయంలో రాజీ తగదన్నారు. నైపర్‌ డైరెక్టర్‌ డా.శశిబాలాసింగ్‌ మాట్లాడుతూ.. ఫార్మా రంగానికి దేశంలో పుష్కల అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నోవర్టీస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ డా.జగన్నాథ్‌ కోట, ఐఐసీటీ(తార్నాక) ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డా.వేణుగోపాల్‌, అవంతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి డా.ఎం.ప్రియాంక, హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ డా.వై.జయప్రద, డా.కె.బాలాజీ, ప్రొ.జె.శివకుమార్‌ పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *