[spt-posts-ticker]

ఫార్మా సిటీ ఏర్పాటు చేయొద్దు

పర్యావరణవేత్తల డిమాండ్‌

ఖైరతాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఫార్మాసిటీ ఏర్పాటు యోచనను విరమించుకోవాలని పలువురు పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు డిమాండ్‌ చేశారు. పర్యావరణవేత్త, సిటిజన్స్‌ ఎగెనెస్ట్‌ పొల్యూషన్‌ సంస్థ నిర్వాహకులు డా.డి.నర్సింహారెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోదండరెడ్డి, పర్యావరణవేత్త ప్రొ.పురుషోత్తంరెడ్డి, విశ్రాంత శాస్త్రవేత్త బాబూరావు తదితరులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లోని రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాలు ఇప్పటికే కాలుష్య కారకాలుగా మారాయన్నారు. ఫార్మాసిటీ వస్తే ప్రకృతి వనరులు ధ్వంసం కావడంతో పాటు ఆర్థిక వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *