[spt-posts-ticker]

ఫీవర్‌ ఆసుపత్రిలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ

నల్లకుంట: హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. ఈ నెల 16న ఇండోనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఎనిమిది మందికి జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో అదేరోజు నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్‌ వార్డులో చేర్చి శాంపిళ్లను సేకరించారు. ఈ క్రమంలో వారిలో ఇద్దరికి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో యువకుడికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. మరోవైపు, కరోనా అనుమానిత లక్షణాలతో మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ వ్యక్తి(35), నగరంలోని రాంనగర్‌కు చెందిన మరో వ్యక్తి(48) బుధవారం ఫీవర్‌ఆసుపత్రిలో చేరారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *