[spt-posts-ticker]

ఫోన్ చేస్తే ఇంటికే పైసలు: ఎస్‌బీఐ క్యాష్ హోమ్ డెలివరీ సర్వీస్

మంచిర్యాల,(ఆరోగ్యజ్యోతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంచిర్యాల రీజియన్ పరిధిలోని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో క్యాష్ హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించారు . కరోనా లాక్డౌన్ వల్ల సీనియర్ సిటిజన్లు, పెన్షన్ దారులు, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బ్యాంకుల కు వెళ్లి డబ్బులు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో మొదటిసారిగా మంచిర్యాల రీజియన్‌లో క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ సేవలను ప్రారంభించారు .నగదు అవసరమైన వారు హెల్ప్ లైన్స్ కు ఫోన్ చేస్తే అకౌంట్ వివరాలు సరి చూసుకొని సంబంధిత బ్రాంచి ద్వారా హోమ్ డెలివరీ చేస్తారు. లాక్డౌన్ ముగిసేంత వరకు ఈ సేవలు అందించనున్నారు. ఖాతా దారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హెల్ప్ డెస్క్ శ్రీనివాస్ 94913 64003, రాజేందర్ 83093 97457, వంశీ 91606 07 0 06, సురేశ్‌ 77995 59900, ప్రదీప్ 99089 27629లను సంప్రదించాలని రీజినల్‌ మేనేజర్ చంద్రశేఖర్‌ సూచించారు. ఇతర ఖాతాదారులు తమకు అవసరమైన సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించవచ్చన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *