నాగర్ కర్నూల్,(ఆరోగ్యజ్యోతి) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. కె.సుధాకర్ లాల్ అద్వర్యంలో కాలెక్టరేట్ ప్రాంగణంలో 180 మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి ఫ్రూట్ జ్యూస్ లను పంపిణీ చేశారు, అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోన వైరస్ అవగాహన కరపత్రాలనుఅయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. కె.సుధాకర్ లాల్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా కష్టపడి పనిచేస్తున్నారని, జాగ్రత్త గా పనిచేయాలనిసుసించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఒక లీటర్ పండ్ల జ్యూస్ ఇస్తున్నామని, మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సర్వే నిర్వహించే సమయంలో జాగ్రతలు అవరమని తెలిపినారు.ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సి.రమేష్ రెడ్డి, కోశాధికారి రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త డి.కుమార్, బ్లడ్/ఆర్గాన్ డొనేషన్ కన్వీనర్ రాజ్ కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు ఓంకార్, రమాదేవి, సురేష్ బాబు, రజిత,మండల వైద్య అధికారి డా. దశరథం, ఆర్.బి.ఎస్.కె. వైద్య అధికారులు, వైద్య సిబ్బంది కేశవులు,అశోక్, రజిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఫ్రూట్ జ్యూస్ లను పంపిణీ
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]