[spt-posts-ticker]

బయటకువస్తే మాస్క్‌ తప్పనిసరి

  • తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచన
  • వినియోగంపై మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) : వివిధ కారణాలతో ఇండ్ల నుంచి బయటకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ, వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్‌ రిపోర్టులు వస్తున్నందున ప్రజలు ఈ జాగ్రత్త పాటించాలని పేర్కొంది. ప్రజలంతా మాస్క్‌లు ధరించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

వైద్య, ఆరోగ్యశాఖ సూచనలు:

మాస్క్‌లు తొలగించేటప్పుడు దాని ముం దుభాగాన్ని, మూలలను తాకకూడదు. చెవుల మీదుగానే తొలగించాలి.

మాస్క్‌ను తొలగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

కార్యాలయాలు, కార్యస్థలాల్లో పనిచేస్తున్నవారంతా అన్నివేళల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.

మాస్క్‌ను ఒకవైపు మాత్రమే వాడాలి. తిప్పి వాడకూడదు.

ఒకసారి వాడిపారేసే (డిస్పోజబుల్‌) మాస్క్‌ ల కంటే క్లాత్‌మాస్క్‌లకు ప్రాధాన్యం ఇవ్వా లి. తప్పనిసరైతేనే డిస్పోజబుల్‌ మాస్క్‌లు ధరించాలి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి మాస్క్‌ను మార్చాలి. ఒకసారి వాడిన డిస్పోజబుల్‌ మాస్క్‌ను తిరిగి ధరించకూడదు.

తిరిగి వినియోగించే క్లాత్‌మాస్క్‌లను ఎప్పటికప్పుడు వేడినీళ్లలో సబ్బు/ డెటాల్‌ ఉపయోగించి శుభ్రంచేయాలి. ఆ తర్వాత ఐదుగంటలపాటు ఎండలో లేదా 15 నిమిషాలు వేడినీళ్లలో ముంచి, ఆరబెట్టాలి.

మాస్క్‌ల వాడకం ఇలా..

ఎన్‌-95 మాస్క్‌లను కరోనా చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది, వ్యాధిగ్రస్థులు కేవలం ఆరోజు మాత్రమే వినియోగించాలి. సాధారణ వైద్యసేవల్లో పాల్గొంటే 72 గంటలు వినియోగించాలి.

ఎన్‌-95 మాస్క్‌లను సాధారణ వ్యక్తులు వారం వరకు ఉపయోగించవచ్చు.

సాధారణ సర్జికల్‌ మాస్క్‌లు ఆరు గంటలు ఉపయోగించాలి. వినియోగాన్ని బట్టి ఏరోజుకారోజు మార్చుకోవాలి.

వైద్యులు, సిబ్బంది ఉపయోగించే మాస్క్‌లను బయోవేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతిలో నిర్వీర్యం చేయాలి.

నాలుగు లక్షల మాస్కులు సిద్ధం

రాష్ట్రంలో 32 జిల్లాల్లో 492 స్వయం సహాయ బృందాలు శుక్రవారంనాటికి సుమారు నాలుగు లక్షల మాస్కులను సిద్ధంచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మాస్కుల వినియోగాన్ని తప్పనిసరిచేసింది. దీంతో పట్టణాల్లోని ఈ బృందాలు మాస్కులతయారీని ముమ్మరంచేశాయి.

ఒక్కరు వంద మాస్కులు పంచాలి

గ్రామ రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరు వంద మందికి మాస్కులు పంచాలని వీఆర్వోల సంక్షేమసంఘం తీర్మానించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి హరాలే సుధాకర్‌రావు, గౌరవాధ్యక్షుడు పెండ్యాల విజయరామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *