హైప్రోలింగ్: ఇది ఆడవాళ్లకు చాలా ముఖ్యమైంది. పిరుదులు, పొట్ట, నడుము దగ్గర ఉన్న కొవ్వు త్వరగా తగ్గిపోతుంది. కూర్చుని రెండు చేతులను వెనకకు ఉంచి, చేతుల మీద బరువు వేస్తూ రెండు పాదాలను పైకి లేపాలి. రెండు మోకాళ్లని కుడివైపు, ఎడమవైపు వంచుతూ పిరుదుల మీద కదులుతూ ఉండాలి. ఇలా ఇరవైసార్లు చేయాలి. నడుం నొప్పి ఉన్నవాళ్లు చేయకూడదు.
శ్రీలింగముద్ర: బరువు తగ్గడానికి ఈ ముద్ర ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని నియమాలను పాటించాలి. ఈ ముద్రను రోజూ నాలుగు నుంచి ఎనిమిది సార్లు వేయాలి. పదకొండు నిమిషాల కంటే ఎక్కువ సేపు వేయకూడదు. వేసిన తర్వాత గ్లాసు నీళ్లు తాగాలి. అరటిపండు, దంపుడు బియ్యం, నిమ్మకాయలు, నెయ్యి, తేనె, తియ్యని మజ్జిగ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ నియమాలు పాటిస్తే తక్కువ రోజుల్లోనే బరువు తగ్గుతారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]