[spt-posts-ticker]

బోథ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం…ఏడుగురికి తీవ్ర గాయాలు

బోథ్‌, (ఆరోగ్యజ్యోతి):  : బోథ్‌ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. దీంతో బాలుడు సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. సోమవారం నుంచి గ్రామంలో మూడు పిచ్చికుక్కలు ఇష్టారీతిన బాటసారులపై దాడికి దిగుతున్నాయి. గ్రామానికి చెందిన ధనుష్‌ అనే బాలుడిని తీవ్రంగా గాయపరచడంతో అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను గాయపరిచాయి. రోడ్లపై కుక్కలు దాడులకు దిగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పిచ్చికుక్కల సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *