[spt-posts-ticker]

భయపడొద్దు: ఈటల

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని, ప్రజలెవరూ భయపడొద్దని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఒక  యువతికి కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాల చర్చలో… కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు రాంచంద్రరావు, జాఫ్రీ సూచించారు. ఈ వైరస్‌ను తక్కువగా అంచనా వేయకూడదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి తెలిపారు. కరోనాపై ముఖ్యమంత్రి ప్రసంగం ధైర్యాన్ని నింపిందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఈ చర్చలో ఫారూఖ్‌హుస్సేన్‌, గంగాధర్‌గౌడ్‌, ఎం.ఎస్‌.ప్రభాకర్‌, ఎగ్గె మల్లేశం, నవీన్‌రావు మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినపుడు నమస్కారం చేయడం ద్వారా వైరస్‌ నియంత్రణకు అవకాశాలు ఉన్నాయని ఛైర్మన్‌ గుత్తా తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *