[spt-posts-ticker]

భారత్‌లో కరోనా విజృంభణ

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండగా.. మరో ఆందోళనకర అంశం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు వరల్డో మీటర్‌ ప్రకటించింది. కొవిడ్‌ బారినపడినవారిలో అత్యధికంగా అమెరికాలో 16,907 మంది క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. భారత్‌లో వారి సంఖ్య 8,944 అని పేర్కొంది. మన కంటే బ్రెజిల్‌లో కేసులు మూడు రెట్లు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ విషమ స్థితిలో ఉన్నవారు 8,318 మాత్రమే. రష్యా(2,300)లో సీరియస్‌ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతు కావడం గమనా ర్హం. కాగా, దేశంలో మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,987 కేసులు నమోదయ్యాయని, 266 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  కరోనా కేసుల్లో మృతుల సంఖ్య 5 శాతం కంటే తక్కువేనని కేంద్రం తెలిపింది. రోగుల్లో 2.25 శాతం ఐసీయూలో ఉన్నారని పేర్కొంది.   దేశంలో వరుసగా ఆరో రోజు 9 వేల పైగా నమోదయ్యాయి. హరియాణ, జమ్ముకశ్మీర్‌, అసోం, కర్ణాటక, చత్తీ్‌సగఢ్‌, త్రిపుర రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో ఆంఫన్‌ సహాయ చర్యల్లో పాల్గొన్న జాతీయ విపత్తు నిర్వహణ  దళం (ఎన్టీఆర్‌ఎ్‌ఫ)కు చెందిన 76 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు.బాలాసోర్‌ డీఆర్‌డీవో యూనిట్‌లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) బృందంలోని 8 మంది జవాన్లకూ కరోనా సోకింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఖైదీ మంగళవారం పరారయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొవిడ్‌తో చికిత్స పొందుతూ వైద్యుడు (56) చనిపోయారు. వైర్‌సతో ఇప్పటివరకు 13 మంది సిబ్బంది మరణించినట్లు సీఐఎ్‌సఎఫ్‌ తెలిపింది.  కట్టడి చర్యలపై హర్షవర్ధన్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించింది. ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిన నేపథ్యంలో ’సామాజిక టీకా’ వంటి జాగ్రత్త చర్యలను కొనసాగించాలని హర్షవర్ధన్‌ సూచించారు. బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా, ఆయన తల్లి మాధవి రాజె సింథియాలకు మంగళవారం కరోనా నిర్ధారణ అయింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *