కరోనాను కట్టడి చేసేందుకు చైనా పటిష్ఠమైన చర్యలకు ఉపక్రమించింది. వైరస్ సోకిన బాధితులను ప్రత్యేక ప్రాంతాల్లో ఉంచుతూ ఇతరులతో కలువకుండా గట్టి చర్యల్ని తీసుకుంటున్నది. ఇంకోవైపు, వ్యాధి ప్రభావిత ప్రాంతాలైన వుహాన్, వెన్జౌ లాంటి నగరాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక్క సభ్యున్ని మాత్రమే అధికారులు బయటకి అనుమతిస్తున్నారు. అదికూడా రెండ్రోజులకు ఒకసారి మాత్రమే. అధికారుల నిషేధాజ్ఞలతో ఆదివారం వెన్జౌ నగరంలోని రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 46 హైవే టోల్ స్టేషన్లను అధికారులు మూసివేశారు. మెట్రో రైలు సేవలు, ప్రజా రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటివరకూ ఈ నగరంలో 265 మందికి వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో తరగతుల్ని మార్చి 1 వరకు ప్రారంభించవద్దని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 17వరకు వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
భారత్లో కరోనా వైరస్.. మూడో కేసు నమోదు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]