భీంపూర్: వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భీంపూర్ మండల వైద్యాధికారి డా.కె.సూరత్‌పై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. ఆయనను గాదిగూడ మండలం ఝరి పీహెచ్‌సీకి బదిలీ చేస్తూ గురువారం జిల్లా వైద్యాధికారి డా.చందు ఉత్తర్వులు జారీచేశారు. సదరు వైద్యుడి వేధింపులతో మనస్తాపానికి గురై ఆరోగ్య పర్యవేక్షకురాలు లూసీ బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆరోగ్యశాఖలో కలకలం రేపిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పాలనాధికారి దివ్య దేవరాజన్ సదరుడి వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఝరి పీహెచ్సీ వైద్యురాలిగా పనిచేస్తున్న డా.వి.సరసిజను భీంపూర్ పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఆశాకార్యకర్తల, ఏఎన్ఎంల పేర నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో డా.సూరత్‌కు బదిలీ స్థానమైన ఝరి ఆసుపత్రిలో ఆర్థికలావాదేవీలు జరపకుండా అధికారాలను నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. గాదిగూడ ఆసుపత్రి వైద్యుడు పవన్‌కుమార్‌కు ఝరి డీడీవో అధికారాన్ని అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే భీంపూర్కు వచ్చిన బాధ్యతలు స్వీకరించాలని డా.సిరసిజకు సూచించారు.
భీంపూర్ వైద్యుడు సూరత్‌పై బదిలీ వేటు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]