.కేంద్ర ఆర్థిక మంత్రికి ఎంపీ కోమటిరెడ్డి వినతి
దిల్లీ,(ఆరోగ్యజ్యోతి): భువనగిరి ఎయిమ్స్‌కు శాశ్వత భవనాల కోసం రూ.1028 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆర్థిక మంత్రితో భేటీ అయిన ఎంపీ కోమటిరెడ్డి పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఐటీఐఆర్ హబ్‌కు నిధులు అందజేయాలని కోరారు. ‘‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బ్లాక్లెవెల్ క్లస్టర్లను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుకు రూ.1013 కోట్లు విడుదల చేయాలి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అభివృద్ధికి ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలి. చేనేత కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం ఏర్పాటుచేయాలి. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలి’’ అని ఎంపీ కోమటిరెడ్డి కేంద్రమంత్రిని కోరారు.