[spt-posts-ticker]

మధుమేహ చికిత్స కోసం కొత్తరకం ఇన్సులిన్‌

మెల్‌బోర్న్‌: మధుమేహ సమస్య ఉన్నవారి కోసం ఒక కొత్త రకం ఇన్సులిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనివల్ల ఔషధ బట్వాడా సమర్థత పెరుగుతుంది. ఇన్సులిన్‌ను రసాయనపరంగా మార్పులు చేయాల్సి వస్తే అందులో నిర్మాణపరమైన అస్థిరత తల్తెతడం, సమర్థత లోపించడం వంటివి జరుగుతాయి. దీనికి తావు లేకుండా ఇన్సులిన్‌కు సమానమైన గ్లైకోఇన్సులిన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఇది సాధారణ ఇన్సులిన్‌కు సంబంధించిన ప్రయోజనాలన్నింటినీ అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్సులిన్‌ పదార్థాలు ఒకేచోట పేరుకుపోవడం వల్ల ఫైబ్రిల్స్‌ ఏర్పడుతుంటాయి. దీనివల్ల ఇన్సులిన్‌ బట్వాడాకు అవరోధం ఏర్పడి, తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. గ్లైకోఇన్సులిన్‌తో ఈ సమస్య ఉండదు. పైగా ఈ మందు మానవ శరీరంలో చాలా ఎక్కువ స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఇన్సులిన్‌ పంప్‌లలో వినియోగానికి ఇది అనుకూలమైంది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *