[spt-posts-ticker]

మరో రెండు కేసులు

దిల్లీ: దేశంలో మరో ఇద్దరికి కరోనా సోకడంతో ఇంతవరకు దాని బారిన పడిన వారి సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇంతవరకు ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. యూపీ నుంచి ఐదుగురు సహా మొత్తం 10 మందిని వారు కోలుకున్న అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
* ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు అక్కడకు వెళ్లిన విమానం ఆదివారం తెల్లవారుజామున ముంబయికి చేరుకోనుంది. ఇటలీలోని మిలన్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానాన్ని పంపిస్తున్నారు.

దిల్లీ మృతురాలికి వైద్య పర్యవేక్షణలో అంత్యక్రియలు
కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన 68 ఏళ్ల మహిళకు దిల్లీలో వైద్యవర్గాల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం నుంచి ఇన్‌ఫెక్షన్‌ ఇతరులకు సోకకుండా సూచనలు చేయాలని దిల్లీ నగరపాలక సంస్థ సిబ్బంది కోరిన మీదట రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు అక్కడకు చేరుకున్నారు. దీనివల్ల అంత్యక్రియల్లో కొంత జాప్యం జరిగింది.  ఈ ఉదంతం నేపథ్యంలో కరోనా మృతుల అంత్యక్రియలకు నిర్దిష్ట మార్గదర్శకాలను కేంద్రం రూపొందించనుంది.

16న సుప్రీంకోర్టులో పరిమిత కేసులే
సుప్రీంకోర్టులోని 15 ధర్మాసనాల్లో పనిచేయనున్న ఆరు ధర్మాసనాలు ఈ నెల 16న ఒక్కొక్కటి కేవలం 12 అత్యవసర కేసులు చొప్పున విచారించనున్నాయి. కరోనా తీవ్రతకు కళ్లెం వేయడంలో భాగంగా కోర్టు పనిని కుదించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అత్యవసర కేసుల లిస్టింగ్‌ నిమిత్తం ఆది, సోమవారాల్లో నిర్దిష్ట సమయాల్లో అధికారులు అందుబాటులో ఉంటారని సుప్రీంకోర్టు శనివారం ప్రకటించింది. సుప్రీంకోర్టులో క్యాంటీన్లను తదుపరి ఆదేశాలు వెలువరించేంతవరకూ తెరవకూడదని కోర్టు పరిపాలనా వ్యవహారాల రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *