[spt-posts-ticker]

మాతాశిశు కేంద్రంలో ఫార్మసీ మూసివేత

మందులు ఎక్కడ ఇస్తారో తెలియక తికమక

ఇబ్బందులు పడుతున్న రోగులు 

నల్లగొండ అ:  జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో కొన్ని రోజులుగా ఫార్మసీ మూసేశారు. ఆస్పత్రికి వచ్చే వారికి మందులు ఎక్కడిస్తారో తెలియక తికమక పడుతున్నారు. గర్భిణుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రంలో ప్రతీరోజు సుమా రు 200 మంది గర్భిణులు వైద్యం కోసం వస్తున్నారు. రోజూ 15 నుంచి 20 ఆపరేషన్లు జరుగుతున్నాయి. అన్ని హంగులతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో కొన్ని వ సతులు లేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత కాలంగా కేంద్రంలోని ఫార్మసీ సేవలు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చిన వారికి డాక్టర్లు మం దులు రాస్తున్నారు. కానీ ఫార్మసీ మూసేసి ఉండటం తో మందులు ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

ఫార్మసీ మూసివేతతో పాటు అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ సేవలు కూడా అం దడం లేదు. అధునాతన అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ పరికరాలు ఉన్నా వాటిని ఉపయోగించే డాక్టర్‌ లేకపోవడంతో మూలనపడ్డాయి. రోగులు బయటనే స్కానింగ్‌ తీయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రి మొత్తానికి ఒకటే చోట ఫార్మసీ ఉండటంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ వందలాది మంది వచ్చే ఆస్పత్రికి చిన్న ఫార్మసీ మాత్రమే ఉండి ఓపీ నమోదు చేసే కేంద్రం వద్ద చిన్న గదిలో ఉండటంతో అది ఎవరికి కూడా కనపడే పరిస్థితి లేదు. మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి, ఫార్మసీకి చాలా దూరం ఉండటంతో రోగులకు ఫార్మసీ ఎక్కడ ఉందో, మందులు ఎక్కడిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఫార్మసీ గర్భిణులకు అందుబాటులో ఉండే విధంగా ఫార్మసీని తిరిగి ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *