[spt-posts-ticker]

మానసిక వికాసంతో ఆరోగ్య పరిరక్షణ

ఏలూరు(ఆరోగ్యజ్యోతి): మానసిక వికాసంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ సమాఖ్య రాష్ట్రస్థాయి ద్వితీయ వార్షిక సదస్సును పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్‌ సిటిజన్లు ప్రధానంగా ఆరోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతుంటారని, వారికి వైద్యసేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు. అఖిల భారత సీనియర్‌ సిటిజన్స్‌ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఐఎం భల్లా, సమాఖ్య రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ కె.రామచంద్రరావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌, హెల్పేజ్‌ ఇండియా అధినేత రజామహ్మద్‌, హనుమంతరావు, నిర్మల తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *